News December 17, 2025

సంగారెడ్డి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు.

Similar News

News December 17, 2025

వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

image

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

News December 17, 2025

బాంబ్ డిస్పోజల్ టీంకు రెండు రోజుల శిక్షణ

image

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో BD టీం (బాంబ్ డిస్పోజల్ టీం)కు సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్‌మెంట్ కోర్స్‌ను ప్రారంభించారు. ఈ కోర్స్ పోలీస్ టీమ్ సభ్యుల ఆచరణాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. BD టీం సభ్యులకు ఆధునిక సాంకేతికతలు, బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ పద్ధతులపై శిక్షణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

News December 17, 2025

కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: హరీశ్ రావు

image

TG: రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన <<18592868>>తీర్పుతో<<>> బహిర్గతమైందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైరయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.