News December 15, 2025
సంగారెడ్డి: జిల్లాలో ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పది మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ ప్రావీణ్య ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా సంఘటనలు జరగలేదని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడో విడత కూడా ఇదే స్పూర్తితో పని చేయాలని తెలిపారు.
Similar News
News December 20, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 20, 2025
SVU: ప్రొఫెసర్ కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారు..?

తిరుపతి ఎస్వీయూలో ర్యాగింగ్ విచారణ నుంచి బయట పడ్డ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారని ప్రచారం జరుగుతోంది. సైకాలజీ విభాగంలో సిబ్బంది తక్కువ ఉండడంతో తీసుకున్నారంటూ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే నెల రోజులు గడవక ముందే.. కేసు విచారణలో ఉండగా ఆయనను తీసుకోవడం పై విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధం అవుతున్నారు.
News December 20, 2025
సంగారెడ్డి: నూతన సర్పంచ్‌లు.. ముందు ఎన్నో సవాళ్లు!

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 22న నూతన సర్పంచ్‌లు పాలక పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెండేళ్లుగా గ్రామాల్లో సర్పంచ్‌లు లేక ప్రధాన సమస్యలు తిష్ట వేశాయి. గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, వీధి దీపాలు, సమావేశాలు, మురికి కాలువలు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాలను ప్రగతిపథంలో నడిపే ఎన్నో సవాళ్లు వారి ముందుకు రానున్నాయి.


