News March 27, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో బడి లేని ఆవాసాలు 335’

సంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీలు నిర్వహించిన సర్వేలో 335 ఆవాస ప్రాంతాలలో బడులు లేనట్లుగా గుర్తించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష పరిధిలోని సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలు లేని ఆవసాలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు లేని ఆవసాలు 190, ఉన్నత పాఠశాలలు లేనివి 140గా గుర్తించారు.
Similar News
News November 4, 2025
బహ్రెయిన్లో మెట్‌పల్లివాసి అంత్యక్రియలు.. సన్నాహాలు

5ఏళ్ల క్రితం బహ్రెయిన్లో మృతిచెందిన మెట్‌పల్లివాసి శ్రీపాద నరేష్ శవం అక్కడి శవాగారంలోనే మగ్గుతోంది. శవాన్ని భారత్‌కు పంపడం సాధ్యం కాదని ఎంబసీ అధికారులు స్పష్టం చేయడంతో బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు నిరంభ్యంతర పత్రంపై సంతకం చేశారు. తదుపరి చర్యలకోసం MLA సంజయ్ మృతుని సోదరుడు ఆనంద్‌తో కలిసి నిరంభ్యంతర పత్రాన్ని ప్రవాసి ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డికి, భీంరెడ్డికి అందించారు.
News November 4, 2025
వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలో ‘టైమ్ బ్యాంకు’

వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలోని కొట్టాయం(D) ఎలికుళం పంచాయతీ ‘టైమ్ బ్యాంక్’ అనే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ముందుగా యువత అక్కడి ఆఫీసులో నమోదవ్వాలి. స్థానిక వృద్ధులకు తోడుగా ఉంటూ సాయం చేయాలి. వారు సేవ చేసిన సమయం ఆ టైమ్ బ్యాంకులో జమ అవుతుంది. వారికి అవసరమైనప్పుడు ఆ పాయింట్ల ద్వారా సేవలు పొందొచ్చు. వలసలతో వృద్ధులు ఒంటరి వారవుతుండడంతో జపాన్ స్ఫూర్తితో దీన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 4, 2025
శ్రీకాకుళం: ‘పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణ కట్టుదిట్టం చేయాలి’

జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసం మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్ట్యా పటిష్ఠమైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి ముఖ్య రోజుల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున భద్రతలు చర్యలు తీసుకోవాలన్నారు.


