News January 21, 2026

సంగారెడ్డి: జిల్లాలో బీజేపీ ప్రభారీల నియామకం

image

మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయా మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జహీరాబాద్‌ ప్రభారీగా పైడి ఎల్లారెడ్డి, అందోల్‌ జోగిపేట మున్సిపాలిటీకి జె.రంగారెడ్డి, నారాయణఖేడ్ ఆలే భాస్కర్ నియమితులయ్యారు.

Similar News

News February 9, 2026

భూపాలపల్లి: ‘ఈనెల 11న స్థానిక సెలవు’

image

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, పబ్లిక్, ప్రైవేట్ అండర్‌టేకింగ్స్, సంస్థలు, ఫర్మ్‌లలో పనిచేసే ఉద్యోగులకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం-1881 ప్రకారం చెల్లింపుతో కూడిన సెలవు వర్తిస్తుంది.

News February 9, 2026

గద్వాల: ముగిసిన మున్సిపల్ ప్రచారం

image

గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారం ముగిసింది. 290 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. అధికారులు ఫిబ్రవరి 11న పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ‘సైలెంట్ పీరియడ్’ అమల్లో ఉండటంతో ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.

News February 9, 2026

సిద్దిపేట: ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య

image

సిద్దిపేట సమీపంలోని పెద్దలింగారెడ్డిపల్లి శివారులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులు నారాయణరావుపేటకు చెందిన శ్రావణ్, పెద్దకోడూరుకు చెందిన నవ్యగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబాలు వారి ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.