News March 3, 2025
సంగారెడ్డి: జిల్లాలో రెండు ఆస్పత్రులపై చర్యలు

జహీరాబాద్‌లోని నీలం, సంగారెడ్డిలోని వెల్ నెస్ హాస్పిటల్‌లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి ఆదివారం తెలిపారు. బాలింత మహానంది మరణంతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. వెల్‌నెస్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
మేడారం గద్దెల చుట్టూ సాలహారం

మేడారం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నూతనంగా నిర్మించిన గద్దెల చుట్టూ గుడిని పోలిన సాలహారం నిర్మించనున్నారు. దీనిపై పూజారులు గుర్తించి ప్రతిపాదించిన వనదేవతల చరిత్ర, అమ్మవార్ల 700 రూపాలను చిత్రీకరించనున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చిత్రాలు రూపొందించనున్నారు.
News September 17, 2025
చరిత్రలో ఈ రోజు: సెప్టెంబర్ 17

✒ 1906: స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం
✒ 1915: భారత చిత్రకారుడు MF హుస్సేన్ జననం
✒ 1929: భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం
✒ 1943: రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి జననం
✒ 1950: ప్రధాని నరేంద్ర మోదీ(ఫొటోలో) జననం
✒ 1948: నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి
✒ 1986: దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జననం
News September 17, 2025
HYD: సాయుధ పోరాటంలో డియర్ కామ్రేడ్స్

తెలంగాణ సాయుధ పోరాటం.. HYD సంస్థానంలో విప్లవం రగిల్చిన మహోత్తర ఘట్టం. ప్రాణాలు పోతోన్నా రజాకార్లకు ఎదురొడ్డిన వీర గాథలు కోకొల్లలు. ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ నినాదంతో మక్దూం మోహియుద్దీన్ కామ్రేడ్‌లను ఏకం చేస్తే, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటంలో రాజ బహదూర్ గౌర్ కీలకంగా వ్యవహరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ప్రజలను నిత్యం చైతన్యం వైపు నడిపించిన కామ్రేడ్స్ SEP 17న అందరి గుండెల్లో నిలిచారు.