News September 11, 2025
సంగారెడ్డి: జిల్లాలో వర్షపాతం వివరాలు

సంగారెడ్డి జిల్లాలో గురువారం కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా సిర్గాపూర్లో 50 మిమీ, జహీరాబాద్ 46, ఖేడ్ 42.5, కడపల్ 42.3, రుద్రారం 41.3, కొండాపూర్ 23.5, కోహీర్ 23.3, మనూర్ 22.3, పాశ మైలారం 20.8, వట్టిపల్లి 20, సదాశివపేట 18.3, హత్నూర 15.3, పుల్కల్ 15, కంది 13, సంగారెడ్డి 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.
Similar News
News September 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 12, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
✒ ఇష: రాత్రి 7.33 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 12, 2025
బ్రహ్మోత్సవాలకు సమష్టిగా పనిచేయాలి: TTD ఈవో

శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పని చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి జరగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం అన్నమయ్య భవన్‌లో శాఖల వారీగా ఆయన సమీక్షించారు. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కోరారు.
News September 12, 2025
నెల్లూరు కొత్త కలెక్టర్ ఈయనే.!

నెల్లూరు కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్‌గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.