News September 11, 2025
సంగారెడ్డి: జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు

జిల్లాలోని 613 పంచాయతీల్లో 7,44,157 మంది ఓటర్ల ఉన్నారని జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 1458 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వివరించారు.
Similar News
News September 11, 2025
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బకాయిల వివరాలు

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.
News September 11, 2025
ADB: వాగు దాటి.. వైద్యం చేసి

బాధిత గ్రామాల ప్రజలకు సేవ చేయడానికి వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. బజార్‌హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి వైద్య సిబ్బంది పడ్డ కష్టాలు చూస్తే వారి అంకితభావం అర్థమవుతుంది. గ్రామానికి అడ్డుగా ప్రవహిస్తున్న వాగును తంటాలు పడుతూ దాటి, నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు.
News September 11, 2025
పాలమూరు: 5,579 TOSS అడ్మిషన్లు

పాలమూరు వ్యాప్తంగా ఈ ఏడాదికి గాను ఓపెన్ SSC, INTER ప్రవేశాల్లో మొత్తం 5,579 మంది అడ్మిషన్లు పొందారని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. జిల్లాల వారీగా..
✒MBNR: 715(SSC), 1120(INTER)
✒NGKL: 310(SSC), 748(INTER)
✒GDWL: 331(SSC), 520(INTER)
✒WNPT: 247(SSC), 533(INTER)
✒NRPT: 410(SSC), 650(INTER)
ఆసక్తిగలవారు రేపటిలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.