News December 26, 2025
సంగారెడ్డి జిల్లాలో 85 స్కూల్ కాంప్లెక్స్‌లకు కంప్యూటర్లు: డీఈఓ

సంగారెడ్డి జిల్లాలోని 85 స్కూల్ కాంప్లెక్స్‌లకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కంప్యూటర్లను పంపిణీ చేసినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా వీటిని అందజేసినట్లు పేర్కొన్నారు. యూ-డైస్ డేటా నమోదు, మధ్యాహ్న భోజన పథకం వివరాల అప్‌లోడింగ్ వంటి కీలక విద్యా పనుల నిర్వహణకు ఈ కంప్యూటర్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. దీనివల్ల సమాచార సేకరణ మరింత సులభతరం కానుందని వెల్లడించారు.
Similar News
News December 26, 2025
భూపాలపల్లి: యాసంగి సీజన్‌లో సన్నాళ్లకే సై అంటున్న రైతులు!

జిల్లాలో యాసంగి సీజన్లో వరి పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందజేస్తుండడంతో యాసంగిలో రైతులు సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే నారు పోసి మడులను నేటితో నింపి భూమిని సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 97,570 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా.
News December 26, 2025
వంటింటి చిట్కాలు మీ కోసం

* కొబ్బరి చట్నీ చేసేటపుడు అందులో నీళ్ళకు బదులు పాలు పోస్తే మరింత రుచిగా ఉంటుంది.
*బెండకాయముక్కలను ఉప్పుతో కడిగితే కూర జిగురు రాదు.
* గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బు నీళ్ళలో వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి.
* టమాటా సూప్ కు మంచి రంగు రావాలంటే అందులో బీట్ రూట్ ముక్క వేయాలి.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
News December 26, 2025
బీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.90.50 కోట్లు మంజూరు

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల కోసం రూ.90.50 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ రెండో విడతకు రూ.69.40Cr, ప్రీ మెట్రిక్ రెండో విడతకు రూ.21.10Cr స్కాలర్‌షిప్ ఫండ్స్ కేటాయించినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.


