News December 20, 2025

సంగారెడ్డి: జిల్లాలో PACS ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాల రద్దు

image

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేసింది. వీరి పదవీకాలం ఆగష్టు 14వ తేదీతో ముగిసినట్లు ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం తొమ్మిది జిల్లాల డీసీసీబీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ఈ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది.

Similar News

News December 20, 2025

ఈ కలుపు మందులతో వయ్యారిభామ నిర్మూలన

image

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.

News December 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 102

image

ఈరోజు ప్రశ్న: విష్ణువు గుర్రపు తలతో ఎత్తిన అవతారం పేరేంటి? ఎందుకు ఆ రూపం ధరించాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 20, 2025

BELలో ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)లో 7 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. సీనియర్ ఇంజినీర్ పోస్టుకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in