News March 7, 2025

సంగారెడ్డి: జిల్లా ఎస్పీ రూపేశ్ బదిలీ

image

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నా చెన్నూరి రూపేశ్‌ను నార్కోటిక్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్‌ను నియమించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

Similar News

News December 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 97

image

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News December 15, 2025

కరీంనగర్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో KNR జిల్లాలో కాంగ్రెస్, BRS మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. 46 స్థానాలు కాంగ్రెస్ గెలవగా, BRS 44 స్థానాలు కైవసం చేసుకుంది. శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలంలో 111 స్థానాలకు జరిగిన కౌంటింగ్లో BRS గెలిచిన స్థానాలు కాకుండా మిగిలిన అన్ని స్థానాల్లోనూ రెండో స్థానంలో ఉంది. మానకొండూరు నియోజకవర్గంలో BRS స్ట్రాంగ్‌గా ఉందని ఈ ఫలితాలను బట్టి చెప్పవచ్చు.

News December 15, 2025

శుక్లా ఆలోచనలను మార్చేసిన కరోనా

image

బెంగళూరులో IT ఉద్యోగం చేస్తున్న ప్రిన్స్ శుక్లాకు కోవిడ్-19తో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగం పోవడం, స్విస్ స్కాలర్‌షిప్ ఆగడంతో గ్రామానికి తిరిగి వచ్చారు. ఊళ్లో తిరుగుతూ సాగులో రైతులను వెనక్కి నెడుతున్న లోపాలను గుర్తించారు. పాత సాగు పద్ధతులు, సరైన మార్కెట్ లేకపోవడం, నాణ్యత లేని విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కొరతను గుర్తించారు. వీటిని రైతులకు అందించాలని రూ.లక్ష అప్పు చేసి ‘AGRATE’స్థాపించారు.