News March 25, 2025
సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
‘విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కృషిచేయాలి’

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ సిటీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
News March 26, 2025
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు: మంత్రి పొన్నం

వాహనదారులకు మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూర్స్ కచ్చితంగా పటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామన్నారు. ఆ తర్వాత వాటిని ఏన్నటికీ పునరుద్ధరించమని అన్నారు.
News March 26, 2025
మార్చి 26: చరిత్రలో ఈరోజు

1872: కవి దివాకర్ల తిరుపతి శాస్త్రి జననం
1971 : పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది
1965: నటుడు ప్రకాశ్ రాజ్ జననం (ఫొటోలో)
1972: నటి మధుబాల జననం (ఫొటోలో)
1990: సినీ గాయని బెంగళూరు లత మరణం
2006: సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు మరణం
2013: నటి సుకుమారి మరణం