News January 31, 2025

సంగారెడ్డి: జిల్లా, మండల స్థాయి అధికారులకు 10th విద్యార్థుల బాధ్యత

image

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఒక్కో పాఠశాలకు జిల్లా, మండల స్థాయి అధికారులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఆయా అధికారులకు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి 10వ తరగతి విద్యార్థుల పర్ఫార్మెన్స్‌ను తెలుసుకోవాలని పేర్కొన్నారు. నివేదికలను ఎప్పటికప్పుడు తనకు సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News November 12, 2025

GHMC వ్యాప్తంగా అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా GHMC ఆధ్వర్యంలో అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం ఆవిష్కరించింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్, ఎలక్ట్రానిక్ ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలను అధికారులకు అందించినప్పుడు వాటిని గతంలో నమోదు చేయకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు వాటన్నింటి వివరాలు నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సిస్టం ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రతి దానికి సంబంధించి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు.

News November 12, 2025

వంటింటి చిట్కాలు

image

* బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.
* గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.
* బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్‌లో ఉంచండి.
<<-se>>#VantintiChitkalu<<>>

News November 12, 2025

కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

image

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌‌కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్‌ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.