News December 30, 2025
సంగారెడ్డి జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

సంగారెడ్డి జిల్లాలో 4,766 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సహకార సంఘాల వద్ద 444 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తి స్థాయి యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Similar News
News December 31, 2025
చైనాకు చెక్.. ఉక్కు దిగుమతులపై సుంకాలు!

ఉక్కు ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన స్టీల్ ప్రొడక్టులపై మూడేళ్లపాటు 11-12% దిగుమతి సుంకాన్ని విధించింది. తొలి ఏడాది 12%, రెండో ఏడాది 11.5%, మూడో ఏడాది 11%గా నిర్ణయించింది. చైనా నుంచి ఇటీవల తక్కువ రేటు స్టీల్ దిగుమతులు పెరిగాయి. ఇది స్థానిక తయారీదారులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ క్రమంలో చైనా డంపింగ్‌ను అడ్డుకునేందుకు ఇండియా టారిఫ్స్ విధించింది.
News December 31, 2025
ధనుర్మాసం: పదహారో రోజు కీర్తన

‘మా ప్రభువైన నందగోపుని భవన రక్షకుడా! మాకు లోనికి వెళ్లే అనుమతివ్వు. మేము గొల్లభామలం, కృష్ణుని దర్శించి సుప్రభాత సేవ చేయడానికి పరిశుద్ధులమై వచ్చాం. ఇంద్రనీల మణివర్ణము గల ఆ స్వామి, మాకు వాద్యము నిస్తానని వాగ్దానం చేశాడు. మేము అజ్ఞానులమైనా ఆయనపై అపారమైన ప్రేమ కలిగిన వారం. కాబట్టి మమ్ములను అడ్డుకోకుండా ఆ మణుల గడియను తెరిచి, స్వామిని చేరుకునేందుకు సహకరించమని ద్వారపాలకుడిని వేడుకుంటున్నాం. <<-se>>#DHANURMASAM<<>>
News December 31, 2025
2025లో చివరి రోజు.. మీ గోల్స్ సాధించారా?

కాలచక్రం గిర్రున తిరిగింది. 2025 ముగింపుకొచ్చింది. ఇంకో రోజే మిగిలింది. ఇల్లు కట్టుకోవాలని, కారు/బైక్ కొనాలని, ఉద్యోగం సాధించాలని ఇలా ఎన్నో గోల్స్ పెట్టుకుని ఉంటారు. మరోవైపు జిమ్/రన్నింగ్ చేయాలని, డ్రింక్/స్మోకింగ్ మానేస్తానని, కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని, రోజూ డైరీ రాయాలని ఇంకెన్నో రెజల్యూషన్స్ అనుకుని ఉంటారు. మరి మీరు పెట్టుకున్న గోల్స్‌ను సాధించారా? రెజల్యూషన్స్ కొనసాగించారా? కామెంట్ చేయండి.


