News April 18, 2025
సంగారెడ్డి జైలులో ఖైదీ మృతి

సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39) గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకట్‌ను ఓ కేసులో ఈనెల 3న సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంకట్ మరణించినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మృతదేహాన్ని సంగారెడ్డిలోని మార్చురీకి తరలించారు.
Similar News
News February 28, 2026
వాంఖడేలో ‘రవిశాస్త్రి’ స్టాండ్

వాంఖడే స్టేడియంలో లెవెల్-1 స్టాండ్‌కు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. క్రికెటర్, కోచ్, కామెంటేటర్‌గా ఆయన సేవలకు గుర్తింపుగా ప్రెస్ బాక్స్ కింది స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. అలాగే దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీ పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. ముంబై దిగ్గజాలను గౌరవించే క్రమంలో అపెక్స్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది.
News February 28, 2026
తిరుపతి: మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తిపై కత్తిపోట్లు

మద్యంమత్తులో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యువకుల మధ్య తలెత్తిన వివాదంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్‌కు చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రుడిని రుయా ఆసుపత్రికి తరలించారు.
News February 28, 2026
రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్‌కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.


