News March 4, 2026
సంగారెడ్డి జైలు సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ బాధ్యతలు

సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగార సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఇదే జైలులో పనిచేసిన ఆయన జూన్‌లో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. తాజాగా ప్రభుత్వం తిరిగి ఆయన్ని సంగారెడ్డికే నియమించడంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జైలు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 14, 2026
HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

HYDలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నాంపల్లి పరిధిలోని బేగంబజార్ ప్రాంతంలో మంగళవారం గరిష్ఠంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్, మారేడ్‌పల్లిలో, హిమాయత్‌నగర్ ప్రాంతంలో హిమాయత్‌నగర్ ప్రాంతంలో 40.5-40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
SHARE IT
News April 14, 2026
అప్పులతో అమరావతి నిర్మాణం అసాధ్యం: విజయ సాయి రెడ్డి

బెంగళూరు, హైదరాబాద్ తరహాలో అమరావతి ఎదగడానికి సమయం పడుతుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో ట్వీట్ చేశారు. అప్పులతో రాత్రికి రాత్రే రాజధానిని నిర్మించడం అసాధ్యమన్నారు. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు మాత్రమే నిర్మించాలని సూచించారు. కాలక్రమంలో ప్రజలు, వ్యాపారాలతో రాజధాని సహజంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారీ డిజైన్ల కోసం ప్రజాధనం వృథా చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని విమర్శించారు.
News April 14, 2026
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ రివర్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు TVS ఎక్సెల్‌పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు లారీ చెక్రాలకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల ఎస్సీ కాలనీకి చెందిన పేరయ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


