News March 8, 2025
సంగారెడ్డి: టీచర్లు ఉన్నత చదువులు చదివేందుకు అనుమతి: డీఈవో

సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లోని పాఠశాలల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 20 మంది ఉపాధ్యాయులకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఉన్నత చదువులు చదివేందుకు అనుమతి ఇస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్బి లో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News November 8, 2025
వీధికుక్కల సంరక్షణపై అధికారుల తర్జన భర్జన

వీధికుక్కల కేసులో <<18231321>>SC<<>> ప్రభుత్వాలకు నిన్న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. వీటి అమలుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వనరుల లేమితో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. స్కూళ్లు, బస్, రైల్వే స్టేషన్లలోకి కుక్కలు రాకుండా ఫెన్సింగ్, NHపైకి మూగజీవాలు రాకుండా ఏర్పాట్లు ఎలా చేయాలోనని మథనపడుతున్నారు. కుక్కల్ని సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని SC ఆదేశించింది. అమలుపై అఫిడవిట్లూ వేయాలని, లేకుంటే చర్యలుంటాయని హెచ్చరించింది.
News November 8, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025
ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

సౌతాఫ్రికా-Aతో జరుగుతోన్న రెండో అన్‌అఫీషియల్ టెస్టులో ఇండియా-A బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132* రన్స్ చేసిన ఆయన, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో IND-A 255, SA-A 221 స్కోర్ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ స్కోర్ 355-6గా ఉంది. జురెల్ (117*), పంత్ (48*) క్రీజులో ఉన్నారు.


