News February 11, 2025
సంగారెడ్డి: డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా రైతుల వినూత్న నిరసన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252534481_50650867-normal-WIFI.webp)
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్‌లో డంప్ యార్డుకి వ్యతిరేకంగా నేటికి ఏడవ రోజు నిరసనలు వెల్లివెత్తుతున్నాయి. నిరసనల్లో భాగంగా రైతులు పాడి పశువులతో డంపు యార్డుకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. పచ్చని పంట పొలాలు డంప్ యార్డు వలన బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడిందని, పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా ఏర్పాటు చేయకుండా విరమించుకోవాలన్నారు.
Similar News
News February 11, 2025
మెదక్: ‘ఇంటర్‌లో 100% ఫలితాలు సాధించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252958385_19780934-normal-WIFI.webp)
ఇంటర్‌లో 100% ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. రామాయంపేట జూనియర్ కళాశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం లెక్చరర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి లెక్చరర్ సబ్జెక్టుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 11, 2025
దేశంలో ‘శాంసంగ్’ డౌన్.. టాప్‌లో వివో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739272713062_695-normal-WIFI.webp)
దేశీయ మార్కెట్‌లో శాంసంగ్ హవాకు బ్రేక్ పడింది. 2024లో ఆ సౌత్ కొరియా కంపెనీ వాటా 17 నుంచి 13.2 శాతానికి పడిపోయి రెండో స్థానంలో నిలిచింది. వివో(చైనా) 15.2 నుంచి 16.6 శాతానికి చేరి టాప్‌లో నిలిచినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. ఐఫోన్ మార్కెట్ 6.4 నుంచి 8.2 శాతానికి చేరినట్లు తెలిపింది. 3-10 స్థానాల్లో వరుసగా OPPO, షియోమీ, రియల్‌మి, ఆపిల్, మోటొరోలా, POCO, వన్‌ప్లస్, ఐక్యూ ఉన్నాయంది.
News February 11, 2025
MBNR: ఎన్నికల నిర్వహణపై శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739271946460_51916297-normal-WIFI.webp)
ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లుగా నియమించిన వారు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం ZP సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లకు ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.