News September 20, 2025
సంగారెడ్డి: ‘డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల జప్తు’

డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్ అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్ఓ బాల సరోజ, సివిల్ సప్లై డీఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
మర్లపాడుకి ఈ నెల 21న మంత్రుల రాక

స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న మర్లపాడులోఎన్.టి.ఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ జరుగనుందని దామచర్ల సత్య శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, డోలాబాల వీరాంజనేయ స్వామి, MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు.
News September 20, 2025
స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న పోలీసులు

ముఖ్యమంత్రి పిలుపు మేరకు శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్”లో భాగంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పోలీస్ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, నివాస ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తను తొలగించి, మొక్కలు నాటారు. శుభ్రత ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
News September 20, 2025
పార్వతీపురంలో వివాహిత ఆత్మహత్య

పార్వతీపురంలో ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. గాసీవీధికి చెందిన ఈశ్వరి (34)ని భర్త మురళీ మద్యం తాగివచ్చి వేధించేవాడు. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ఆమె బొబ్బిలిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఇంటికి తిరిగిరాగా భర్త మళ్లీ వేధించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యలు జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.