News March 18, 2025

సంగారెడ్డి: తండ్రి, కూతురు, కొడుకు అదృశ్యం..

image

ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి అదృశ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి పీఎస్ పరిధిలోని పర్వతాపూర్‌కు చెందిన గోపాల్ రెడ్డి (38) జనవరి 17న తన కూతురు తనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డిలతో కలిసి సంగారెడ్డికి వెళ్లి ఇప్పటికి తిరిగి రాలేదని స్థానిక ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అతని తల్లి గురడి శోభమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

image

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

News September 16, 2025

పెద్దపల్లి: ‘జర్నలిస్టు సాంబశివరావుపై కేసులు ఎత్తివేయాలి’

image

టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఉల్లంఘన అని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ ఖండించారు.

News September 16, 2025

HNK, BHPLలో నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్ సేవలు

image

హనుమకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్, భూపాలపల్లి పోస్ట్ ఆఫీస్‌లో రైల్వే రిజర్వేషన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రతిరోజు కనీసం 10 టికెట్ల బుకింగ్ జరగడం లేదనే కారణంతో ఈ సేవలను నిలిపివేస్తూ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీనియర్ సిటిజన్స్ సహా నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కావ్య తక్షణమే ఈ సేవలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.