News September 11, 2025
సంగారెడ్డి: తనిఖీలకు కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, వసతి గృహాలను తనిఖీలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆదేశాలు ఇచ్చారు. లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూల్చివేత నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలను ఇచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు వివరాలను ఎంఈవోలు తనిఖీలు చేసి వెంటనే ఇవ్వాలన్నారు.
Similar News
News September 11, 2025
జూబ్లీహిల్స్: ఆశల పల్లకిలో ‘హస్తం’ అభ్యర్థులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. BRS నుంచి మాగంటి సునీతకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. BJP నుంచి లంకల దీపక్ రెడ్డి, ఇతరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే మంత్రి పదవి ఖాయం అంటూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఆశల పల్లకిలో విహరించడం గమనార్హం.
News September 11, 2025
NZB: వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

నిజామాబాద్ సుభాష్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహేష్(32) వాహనంలో వెనుక కూర్చొని వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల మహేష్ కింద పడి గాయలపాలయ్యాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 11, 2025
నేడు అనకాపల్లిలో మెగా జాబ్ మేళా

అనకాపల్లి రాజా థియేటర్ వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల యువతీ యువకులు అర్హులుగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు.