News January 12, 2026
సంగారెడ్డి: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News February 12, 2026
1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
News February 12, 2026
నంద్యాల: ఎదురు చూపులు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా కొత్త పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వితంతువులతో పాటు వృద్ధాప్య, కళాకారులు, ఇతర పింఛన్లకు అర్హత కలిగిన సుమారు 6 వేలకు మందిపైగా ఉన్నారు. వారంతా నూతన పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని అర్హత కలిగిన లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News February 12, 2026
సంగారెడ్డి: ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో!

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో ఎవరీ అదృష్టం వరిస్తుందో తెలియాలి అంటే 13న కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.


