News March 3, 2025

సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

image

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని డివెన్ విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.

Similar News

News November 6, 2025

విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

image

విశాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్‌ పేపర్‌ లైసెన్స్‌ వెండర్లు, డాక్యుమెంట్‌ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.

News November 6, 2025

మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

image

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్‌గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

News November 6, 2025

తిరుపతి కేంద్రంగా కీలక కేసులు దర్యాప్తు

image

తిరుపతి కీలక కేసుల దర్యాప్తు కేంద్రంగా మారింది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై 1 మ్యాన్ కమిటీ, కల్తీ నెయ్యి సరఫరాపై CBI నేతృత్వంలోని సిట్, మదనపల్లె ఫైల్స్ దగ్ధంపై CID విచారణ, బోగస్ ఓటర్ కార్డులు, లిక్కర్ స్కాం వంటి కేసుల దర్యాప్తులు సాగుతున్నాయి. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో పరకామణి చోరీ కేసు విచారణ కోసం CID తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది.