News January 14, 2026

సంగారెడ్డి: త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం: మంత్రి

image

తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన 1257 మందికి నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య శాఖలో గత రెండేళ్లలో 9,572 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.

Similar News

News January 24, 2026

రూ.52 కోట్ల జరిమానాపై సంతృప్తి: బాపట్ల MP

image

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అధికారులు పూర్తిగా అరికట్టాలని MP తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గడిచిన మూడేళ్లలో అక్రమ తవ్వకాలపై రూ.52 కోట్లు జరిమానా విధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 3 మున్సిపాలిటీల్లో అమృత్-2 కింద నీటి ట్యాంకుల అభివృద్ధికి రూ.96.45 కోట్లు విడుదలయ్యాయన్నారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా పనులకు టెండర్లు పిలువగా, టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

News January 24, 2026

కాగజ్‌నగర్‌లో విషాదం.. భవానీ మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 24, 2026

వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రిపబ్లిక్ డే సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.