News April 25, 2025

సంగారెడ్డి: దరఖాస్తులకు రేపే చివరి తేదీ: డీఈవో

image

జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు రేపటి లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.

Similar News

News April 25, 2025

పోలీసులకు సవాల్‌గా మారిన వీరయ్య హత్య కేసు?

image

మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్లు ఉంది. హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఎస్పీ వెళ్లడానికి అరగంట పట్టింది. ఈ సమయంలో చుట్టుపక్కల చెక్‌పోస్టులను అలర్ట్ చేసి ఉంటే దుండగులు దొరికే వారని పలువురు ఆరోపిస్తున్నారు.

News April 25, 2025

నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 2న అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News April 25, 2025

ఏయూ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

image

ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో హాజరు సరిగ్గా లేదని 30మంది విద్యార్థుల హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఘోరమన్నారు. ఈ విషయంపై గురువారం ఏయూ వీసీ ఆఫీస్ వద్ద AISF నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈవిషయం వీసీ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేదని నిరసన చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శశిభూషణరావు స్పందించి శుక్రవారం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

error: Content is protected !!