News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 12, 2025

సంగారెడ్డి: నేడు జాబ్ మేళా

image

సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 12న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఫార్మసీలో ఫార్మసిస్ట్, అన్నపూర్ణ ఫైనాన్స్‌లో ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదో తరగతి, బీ ఫార్మసీ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.

News September 12, 2025

అవాల్గావ్ గ్రామ శివారులో చిరుత సంచారం?

image

మద్నూర్ మండలం అవాల్గావ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం గ్రామ శివారులో రైతులు చిరుత పులి పాద ముద్రల ఆనవాళ్లను చూశారు. దీంతో భయభ్రాంతులకు గురై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులి ఆనవాళ్లను పరిశీలించారు. గ్రామస్థులు, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 12, 2025

ఒక తప్పిదం క్షణాల్లో జీవితాన్ని నాశనం చేస్తుంది: SP

image

కామారెడ్డి టౌన్ PS పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 61 మందిపై కేసులు నమోదు చేసి, వారికి కోర్టు మొత్తం రూ.56 వేల జరిమానా విధించింది. SP రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఒక చిన్న తప్పిదం కూడా క్షణాల్లో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.