News December 24, 2025
సంగారెడ్డి: ‘దళితులపై దాడి.. చర్యలు తీసుకోవాలి’

సజ్జాపూర్ గ్రామంలో దళితులపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్
బక్కి వెంకటయ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పారితోష్ పంకజ్‌లతో బుధవారం సమావేశం అయ్యారు. దాడికి సహకరించిన సర్పంచిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కోహిర్ ఎస్ఐ, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.
SHARE IT
News December 25, 2025
BNGR: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన రెండు వారాలకే మృతి

బూర్గుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు సభ్యుడిగా గెలుపొందిన చింతల చిన్న నర్సయ్య (60) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. విజయం సాధించి రెండు వారాలు కూడా గడవకముందే ఆయన మృతి చెందడం గ్రామస్థులను కలచివేసింది. సర్పంచ్ చింతల సంపత్, పాలకవర్గ సభ్యులు ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.


