News January 2, 2026

సంగారెడ్డి: ‘దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.లక్ష’

image

దివ్యాంగులను దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. 19-5-2025 తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన వారు http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

Similar News

News January 2, 2026

ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

image

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, ప‌న‌స‌, వాక్కాయ‌లు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల త‌గ్గ‌డంతో పాటు క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.

News January 2, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఐఐటీ<<>> గువాహటి 22 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు టీచింగ్/రీసెర్చ్/ ఇండస్ట్రీయల్ అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitg.ac.in/

News January 2, 2026

కర్నూలు: ఉద్యోగ బెంగతో గుండెపోటుతో యువతి మృతి

image

7 ఏళ్ల నుంచి డీఎస్సీకి సిద్ధమవుతూ ఉద్యోగం రాలేదనే బెంగతో గుండెపోటుకు గురై ఆదిలక్ష్మి(27) మృతిచెందిన విషాద ఘటన గోనెగండ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీరాములు-రంగమ్మ (వ్యవసాయ కూలీలు) దంపతుల కుమార్తె ఆదిలక్ష్మి ఉద్యోగం రాలేదని ఆవేదన చెందుతూ ఉండేది. దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. ఆదిలక్ష్మి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.