News March 21, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించిన తర్వాత వెంటనే ఆర్డీవో, కలెక్టరేట్ పంపించాలని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

Similar News

News September 4, 2025

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

నర్సాపూర్లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.

News September 4, 2025

మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక: డీఈవో

image

మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు డీఈవో ప్రొ. రాధాకిషన్ తెలిపారు. ఈనెల 6న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ ఉపాధ్యాయులున్నారని డీఈవో వివరించారు.

News September 4, 2025

మెదక్: సీఎం వస్తారనుకున్నారు… కానీ రావట్లేదు..!

image

భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదం కనులారా వీక్షించి కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు సీఎం వస్తాడని ఆశించిన అన్నదాతలు ఆవిరయ్యాయి. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పోచారం ప్రాజెక్ట్ సందర్శిస్తారని ప్రచారం జరిగింది. పర్యటన షెడ్యూల్ లో లేకపోవడంతో నిరాశ చెందారు. వందలాది ఎకరాల పంట, రోడ్డు, ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తీరని నష్టం మిగిలింది. సీఎం వస్తే కొంత ఉపశమనం కలిగేదని ఆశించారు.