News October 29, 2025

సంగారెడ్డి: నవంబర్ 5న నదర్ సమ్మేళనం: జగ్గారెడ్డి

image

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద సదర్ సమ్మేళనం నవంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సదర్ సమ్మేళనం పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రదీప్ కుమార్, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.

Similar News

News October 29, 2025

ములుగు: భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

తుఫాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వర్షాల దృశ్య తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 4257109 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

News October 29, 2025

గుంటూరు జిల్లాలో పలు బస్సు సర్వీసులు రద్దు

image

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసినట్లు డీపీటీఓ సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల్లో కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారని, తద్వారా రద్దీ తగ్గడంతో సర్వీసులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల వాగులు పొంగటం, చెట్లు పడటంతో రద్దు చేశామన్నారు.

News October 29, 2025

రేగొండ: ఎయిర్ కూలర్ వైరు తగిలి చిన్నారి మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్‌జీ తండాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బానోతు అంజలి (3), కరెంటు బోర్డుకు, కిందకు వేలాడుతున్న ఎయిర్ కూలర్ వైరును ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.