News September 15, 2025
సంగారెడ్డి: నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల సెప్టెంబర్ 23లోపు https://www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల

ANUలో పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను సోమవారం పరీక్షల నియంత్రణాధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జులైలో జరిగిన ఎం.ఎస్సీ స్టాటిస్టిక్స్, ఎం.ఎస్సీ బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్‌కు ఆసక్తిగల విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860 చొప్పున ఈ నెల 24వ తేదీలోపు చెల్లించాలని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలిపారు.
News September 15, 2025
విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 17న విశాఖలో పర్యటించనున్నారు. 16న రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జిఎస్టి సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12 గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు. 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
News September 15, 2025
దూబే ఉంటే టీమ్ ఇండియాకు ఓటమి దూరం!

టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే అరుదైన రికార్డు నెలకొల్పారు. వరుసగా 31 టీ20 మ్యాచుల్లో ఓటమెరుగని క్రికెటర్‌గా నిలిచారు. ఆయన ఆడిన గత 31 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో నిన్న జరిగిన మ్యాచులోనూ ఈ పరంపర కొనసాగింది. 2020లో న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది. 31 మ్యాచుల్లో 25 గెలవగా నాలుగు టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు.