News September 20, 2025
సంగారెడ్డి: నామినేషన్ల గడవు పొడిగింపు

ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడవును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక నామినేషన్లు సమర్పించిన జిల్లాగా సంగారెడ్డిని నిలిపేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు. ఇంకా నామినేషన్లు పంపనివారు ఈ గడువులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 20, 2025
సిద్దిపేట: 21న చింతమడకకు కవిత రాక

మాజీ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకకు ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వస్తున్నారని జాగృతి ప్రతినిధులు తెలిపారు. కాగా ఇటీవల పలువురు గ్రామస్థులు కవితని కలిసి గ్రామంలో జరిగే బతుకమ్మ వేడుకలు రావాలని కోరారు. స్పందించిన కవిత ఉత్సవాలకు హాజరవుతారని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వస్తున్నారని తెలిపారు.
News September 20, 2025
కృష్ణా జిల్లా అండర్-19 హాకీ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 23న మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో అండర్-19 హాకీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత్ తెలిపారు.
News September 20, 2025
సంగారెడ్డి: ‘డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల జప్తు’

డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్ అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్ఓ బాల సరోజ, సివిల్ సప్లై డీఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.