News August 20, 2025

సంగారెడ్డి: ‘నిబందనలు ఉల్లంఘిస్తే చర్యలు’

image

వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా శాంతి భద్రతల కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. వినాయక ప్రతిమలు ప్రతిష్టించేవారు ఆన్లైన్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, నిబందనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

Similar News

News August 20, 2025

EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

image

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>

News August 20, 2025

సంగారెడ్డి: 21వరకు గడువు పొడిగింపు

image

జిల్లాలోని ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 21 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు మండలాలలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

News August 20, 2025

ADB: డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా..?

image

ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలో KU దూరవిద్య(SDLCE) పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపాదికన దరఖాస్తు గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. పీజీ 674, డిగ్రీ 673 స్టడీ సెంటర్ నంబర్ కోడ్ ద్వారా www.sdlceku.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పత్రాలతో పాటు సర్టిఫికెట్లను కళాశాలలో అందజేయాలని సూచించారు.
SHARE IT