News September 2, 2025
సంగారెడ్డి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. నిమజ్జన వేడుకలు డీజే సౌండ్‌ను నిషేధించినట్లు చెప్పారు. పోలీసుల సూచనలను నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. నిమజ్జన వేడుకలకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News September 3, 2025
ASF ఉద్యోగులకు క్రీడా పోటీలు: రమాదేవి

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార ఆదేశాల మేరకు ASF జిల్లాలో వివిధ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీల సెలక్షన్స్ ఈ నెల 4 నుంచి నిర్వహించడం జరుగుతుందని డీవైఎస్ఓ రమాదేవి తెలిపారు. HYDలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలు కోసమే ఈ సెలక్షన్స్ నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 4 వ తారీకు ASF గిరిజన క్రీడా పాఠశాలలో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 8008090626 నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
News September 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 3, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.49 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
✒ ఇష: రాత్రి 7.41 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 3, 2025
ఐదు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు: కలెక్టర్

వ్యాధుల నిర్మూలన కోసం ఐదు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్‌వాడీ, పంచాయతీ భవన సముదాయాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. విధులు సరిగా నిర్వర్తించని వారిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.