News July 10, 2025
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.
Similar News
News July 10, 2025
VJA: సాగునీటి అవసరాలకు నీటి విడుదల

కృష్ణా డెల్టా రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి KEB కెనాల్ 1205 క్యూసెక్కులు, బందరు కెనాల్ 1,354 (క్యూ), ఏలూరు కెనాల్ 1216 (క్యూ), రైవస్ కెనాల్ 4001 (క్యూ), KE మెయిన్ 7764 (క్యూ), KW మెయిన్ 1216 (క్యూ), మొత్తం కాలువల ద్వారా 8,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
News July 10, 2025
భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలకు భారీ బందోబస్తు

వరంగల్ భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న శాకాంబరీ ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉత్సవాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 250 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా మట్టెవాడ సీఐ గోపి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
News July 10, 2025
చాగల్లు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చాగల్లుకు చెందిన (59) శ్రీరంగం కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బుధవారం తెల్లవారుజామున రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి చాగల్లులో కృష్ణారావు మోపెడ్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు.