News January 28, 2025

సంగారెడ్డి: నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తూ డీఆర్పీలుగా ఎంపికైన ఉపాధ్యాయులకు నేటి నుంచి రెండు రోజులపాటు ఐఎఫ్‌పీఎస్ పై హైదరాబాద్‌లోని టీఆర్ఆర్ రాజేంద్రనగర్‌లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 10, 2026

రామగుండం: తాళాలు వేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పండుగలు, సెలవుల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా పరిశీలించాలన్నారు. సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమని తెలిపారు.

News January 10, 2026

కోటీశ్వరులు పెరిగారు!

image

దేశంలో కోటీశ్వరుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ సమాచారం మేరకు కోటికి పైగా ఆస్తులు ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కి పెరిగింది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఇది 8.92 కోట్లుగా ఉండేది. కోటీశ్వరుల సంఖ్యలో 21.65% వృద్ధి నమోదు కాగా, రిటర్నులు 1.22% మాత్రమే పెరగడం గమనార్హం.

News January 10, 2026

కోనసీమ: బ్లో అవుట్.. ఆదుకోనున్న ‘బీఓపీ’

image

ఇరుసుమండ బ్లో అవుట్‌ నివారణలో బ్లో అవుట్ ప్రివెంటర్ (బీఓపీ) కీలకమని నిపుణులు తెలిపారు. డ్రిల్లింగ్ సమయంలో అత్యధిక ఒత్తిడితో గ్యాస్ పైకి రాకుండా ఈ భారీ వాల్వ్ అడ్డుకుంటుందని వివరించారు. వెల్ క్యాపింగ్ కోసం ప్రస్తుతం ఈ పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాణ నష్టాన్ని నివారించడంలో దీని పాత్ర అత్యంత కీలకమని నిపుణులు పేర్కొన్నారు.