News February 17, 2026
సంగారెడ్డి: నేటి నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి 24 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మండల వనరుల కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను సేకరించాలని సూచించారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు దోహదపడతాయన్నారు.
Similar News
News February 17, 2026
క్యాతనపల్లిలో రేపు రాత్రి 8 వరకు ఆంక్షలు..!

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచి సెక్షన్ 163 BSNN యాక్ట్ అమల్లోకి వచ్చిందని, రేపు రాత్రి 8 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని RGM CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషిద్ధం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉద్రిక్తత చోటుచేసుకునేలా, రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు, గొడవలకు దిగడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 17, 2026
భారీ జీతంతో SETలో ఉద్యోగాలు

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 సైంటిస్ట్ E, Fపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech, MSc(CS, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), ME/MTech/PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైంటిస్ట్ F పోస్టుకు నెలకు రూ.1.31L-రూ.2.16L, సైంటిస్ట్ E పోస్టుకు రూ. 1.23L-రూ.2.15L చెల్లిస్తారు.
News February 17, 2026
‘కర్తరీ’ అంటే అర్థం ఇదే..

కత్తెరను సంస్కృతంలో కర్తరీ అంటారు. కత్తెర ఎలా అయితే వస్తువులను రెండుగా కత్తిరిస్తుందో, అలాగే ఈ కాలంలో సూర్యుడి వేడి భూమిని కూడా అలా చీల్చేంత బలంగా ఉంటుందని భావన. సూర్యతాపం కత్తెర లాగా పదునుగా ఉండి, జీవరాశిని పీడించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. మన పూర్వీకులు వాతావరణంలోని ఈ తీవ్రతను గమనించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ పేరును ఖరారు చేశారు. అందుకే ఈ కాలాన్ని కర్తరీ రోజులు అని పిలుస్తారు.


