News February 17, 2025

సంగారెడ్డి: నేటి నుంచి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

image

పాఠశాలలో చదివే విద్యార్థులకు నేటి నుంచి మార్చి 15వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్, జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొబైల్ హెల్త్ టీం వాహనాల్లో రోజుకు 50 మంది విద్యార్థులు తరలించి కంటి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

NTR: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ. ఇంగ్లిష్, జర్నలిజం, సోషల్ వర్క్, సోషియాలజీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://anucde.info/ResultsJAug25.asp చూడాలని ANU(దూరవిద్య) పరీక్షల విభాగం తెలిపింది.

News November 5, 2025

కృష్ణా: NH 65 రహదారి విస్తరణపై అధికారులు, MLAల సమావేశం

image

విజయవాడ-మచిలీపట్నం మధ్యనున్న NH 65 రహదారి 6 లైన్ల విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కలెక్టర్లు DK బాలాజీ, డా.లక్ష్మీశా, జేసీలు ఎం.నవీన్, ఎస్.ఇలక్కియా, NHAI అధికారులు పాల్గొన్నారు. ఈ రహదారిలో బెంజిసర్కిల్ నుంచి చినగార్లపాడు వరకు అండర్ పాస్‌లు నిర్మించాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రస్తుత డిజైన్లను సైతం మార్చాలని అధికారులు, ఎమ్మెల్యేలు NHAI అధికారులకు సూచించారు.

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.