News December 12, 2025
సంగారెడ్డి: నేటి సాయంత్రం నుంచి ప్రచారాలపై నిషేధం: కలెక్టర్

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారాలపై నిషేధాన్ని విధించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికలు జరుగనున్న ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/
News December 13, 2025
బత్తాయిలో ఆకుముడత, మంగునల్లి కట్టడికి జాగ్రత్తలు

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 13, 2025
తిరుమల కల్తీ నెయ్యి.. నిందితులు ఏం చెప్పారు.?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యం కస్టడీ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కల్తీ నెయ్యి ట్యాంకులు ఎలా వచ్చాయి, ఎవరెవరు వచ్చే వాళ్లు, వారు మీతో ఎలా స్పందించే వారిని ప్రశ్నించారని తెలుస్తోంది. ఏ16 కూడా శుక్రవారం అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని సమాచారం. కాగా వైద్య పరీక్షలు అనంతరం వారిని నెల్లూరు జైలులో అప్పగించారు.


