News September 12, 2025
సంగారెడ్డి: నేడు జాబ్ మేళా

సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 12న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఫార్మసీలో ఫార్మసిస్ట్, అన్నపూర్ణ ఫైనాన్స్‌లో ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదో తరగతి, బీ ఫార్మసీ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News September 12, 2025
నేడు విజయవాడలో Way2News కాన్‌క్లేవ్

AP: విజయవాడలో ఇవాళ Way2News కాన్‌క్లేవ్ నిర్వహించనుంది. CM చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, MPలు భరత్, హరీశ్ బాలయోగి పాల్గొననున్నారు. YCP నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కాన్‌క్లేవ్‌కు హాజరుకానున్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనే వివిధ అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మ.12గంటల నుంచి యాప్‌లో LIVE వీక్షించొచ్చు.
News September 12, 2025
పల్నాడు జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్ల

పల్నాడు జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియమితులయ్యారు. గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆమె పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో దిశ పర్యవేక్షణ ప్రత్యేక అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
News September 12, 2025
ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.