News March 15, 2025
సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రుల (పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.
Similar News
News November 8, 2025
గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.
News November 8, 2025
కుప్పంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు.. 22 వేల మందికి ఉపాధి

☞ <<18231350>>ఆదిత్య బిర్లా<<>>- రూ.586 కోట్లు(Cr) పెట్టుబడి- 920 మందికి ఉపాధి
☞ ACE పరిశ్రమ- రూ.525 Cr పెట్టుబడి – 7 వేల మందికి ఉపాధి
☞ SVF సోయా- రూ.372.8 Cr పెట్టుబడి- 2500 మందికి ఉపాధి
☞ మదర్ డెయిరీ- రూ.260 Cr పెట్టుబడి- 4000 మందికి ఉపాధి
☞ శ్రీజ కంపెనీ- రూ.233Cr పెట్టుబడి- 4 వేల మందికి ఉపాధి
☞ ఈ-రాయిస్- రూ.200Cr పెట్టుబడి- 410 మంది ఉపాధి
☞ ALEAP పరిశ్రమ-రూ.26.7Cr పెట్టుబడి- 3500 మందికి ఉపాధి.
News November 8, 2025
సిరిసిల్ల నుంచి ప్రత్యేక బస్సు

సిరిసిల్ల నుండి ఏపీలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ నెల 14న మధ్యాహ్నం సిరిసిల్లలో బయలుదేరే బస్సు ద్వారక తిరుమల, పిఠాపురం, అన్నవరం. సింహాచలం, కైలాసగిరి, కనకమహాలక్ష్మి దేవాలయం సందర్శన అనంతరం 16న రాత్రి సిరిసిల్ల చేరుకుంటుందని, పెద్దలకు రూ.2900, పిల్లలకు రూ.2030 చార్జి ఉంటుందని, భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలని డిపో మేనేజర్ ప్రకాష్ తెలిపారు.


