News March 31, 2025
సంగారెడ్డి: నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు.!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కాబట్టి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News November 16, 2025
పింగిళి కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

HNK వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ- పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్), ఎమ్మెస్సీ (జువాలజీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్) వంటి కోర్సులకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు. సీపీజీఈటీ-2025 అర్హత తప్పనిసరి అని చెప్పారు.
News November 16, 2025
పల్నాడు: గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2025-26 సంవత్సరానికి మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను పంచాయితీలకు జమచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాకు రూ.31కోట్లు విడుదలయ్యాయి. చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
News November 16, 2025
దేవారాపల్లి: ప్రమాదకర ప్రయాణం చేసిన మహిళలు

వరి కోతలతో వ్యవసాయ పనులకు డిమాండ్ పెరిగింది. సుమారు 25 మందికి పైగా మహిళా కూలీలు ఒక్క ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యం దేవరాపల్లి (M) కాశీపురంలో ఆదివారం కనిపించింది. పని ప్రదేశాలకు సకాలంలో చేరుకోవడానికి, రవాణా ఖర్చు ఆదా చేసుకోవడానికి, ప్రాణాలకు తెగించి ఇలా ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆటోలో నిలబడటానికి కూడా చోటు లేక, కొందరు మహిళలు అంచుల్లో వేలాడుతూ ప్రయాణం కొనసాగించారు.


