News December 31, 2025
సంగారెడ్డి: న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

జిల్లా ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
ఏడూళ్ల బయ్యారంలో జాతీయ కబడ్డీ సమరం: కలెక్టర్

పినపాక ఏడూళ్ల బయ్యారం జడ్పీ పాఠశాలలో ఈ నెల 7 నుంచి 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా ప్రతిష్ఠ చాటేలా ఈ పోటీలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
విశాఖ: సోమవారం నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

విశాఖ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో జనవరి 5 నుంచి 9 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 1.09 లక్షల తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ల (MBU) పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగే ఈ సదుపాయాన్ని విద్యార్థులు, ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News January 3, 2026
ఆర్టీసీ బస్సులో ఊయల.. కన్నతల్లి ప్రేమకు నిదర్శనం

భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం ఒక అపురూప దృశ్యం ప్రయాణికులను ఆకట్టుకుంది. బస్సులో చంటిబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో, ఆ తల్లి తన బ్యాగులోని చీరను తీసి బస్సు హ్యాండిల్స్‌కు కట్టి ఊయలగా మార్చింది. అందులో పడుకోబెట్టగానే ఆ చిన్నారి ఏడుపు ఆపి హాయిగా నిద్రపోయింది. కన్నతల్లి ప్రేమకు, సమయస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


