News March 23, 2025
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News March 24, 2025
బాపట్ల: సీఎం పర్యటించేది ఈ గ్రామంలోనే.!

సీఎం నారా చంద్రబాబు ఏప్రిల్ 1న పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం పెదగంజాం గ్రామంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెల్లడించారు. గ్రామంలో ఆరోజు జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఆయన తెలిపారు. కాగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
News March 24, 2025
రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.