News January 1, 2026

సంగారెడ్డి: పదిలో మెరుగైన ఫలితాలను సాధించాలి: డీఈఓ

image

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రామ్ చందర్, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

తమిళనాడు-పుదుచ్చేరీ ఎన్నికల పరిశీలకుడిగా మంత్రి ఉత్తమ్

image

త్వరలో జరగనున్న తమిళనాడు-పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది. ఎన్నికల వ్యూహాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రచార తీరును పర్యవేక్షించేందుకు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నియామకంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News January 8, 2026

ఏంటి తమ్ముడూ ఈ ఆట.. ఇంకా పెంచుతావా: అశ్విన్

image

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత కొన్ని నెలలుగా <<18788014>>సంచలన ప్రదర్శన<<>> చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. గత 30 రోజుల్లో దేశీయ, U-19 క్రికెట్‌లో వైభవ్ సాధించిన 171, 190, 108*, 127 వంటి భారీ స్కోర్లను Xలో షేర్ చేశారు. “ఏంటి తమ్ముడూ ఈ ఆట? ఇంకా పెంచుతావా?” అంటూ తమిళంలో కామెంట్స్ చేశారు. ఇంత చిన్న వయసులో ఇంతటి భారీ స్కోర్లు చేయడం అద్భుతమని కొనియాడారు.

News January 8, 2026

ఉరి వేసుకుని మిర్యాలగూడలో మహిళ ఆత్మహత్య

image

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డపాక జగదీష్ తన భార్య నాగమణితో కలిసి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం బాత్రూంకు వెళ్లిన నాగమణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.