News February 23, 2025

సంగారెడ్డి: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: జిల్లా కలెక్టర్

image

రామచంద్రపురం మండలం వెల్మెల ఆదర్శ పాఠశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలను, విద్యార్థులు చదువుతున్నా తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

వరంగల్: తుపాకీ పట్టారు.. తూటాకు బలయ్యారు..!

image

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్ వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నేతలు అమరులవుతున్నారు. ఇప్పటివరకు జనగామకు చెందిన గుమ్మడవెల్లి రేణుక, భూపాలపల్లికి చెందిన గాజర్ల రవి, వరంగల్‌కు చెందిన మోదెం బాలకృష్ణతో పాటు సుధాకర్, ఏసోలు, అన్నై సంతోశ్, సారయ్య, ఇలా ఒక్కొక్కరుగా ఉద్యమ బాటలో ఊపిరి వదులుతున్నారు.

News September 18, 2025

నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

image

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.

News September 18, 2025

జగిత్యాల నాయకులకు మన్ కీ బాత్ బాధ్యతలు

image

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జిల్లాల వారీగా మన్ కీ బాత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేస్తున్న సందేశాలను ప్రతి జిల్లాలో ప్రసారం చేసి, గ్రామస్థాయికి చేర్చే బాధ్యత ఈ నియమిత నాయకులపై ఉండనుంది. JGTL నుంచి పిల్లి శ్రీనివాస్ కన్వీనర్‌గా, దొణికెల నవీన్ కో-కన్వీనర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.