News February 23, 2025
సంగారెడ్డి: పది ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి: డీఈవో

జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను https://bse.telangana.gov.in అనే వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
Similar News
News July 6, 2025
చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
News July 6, 2025
రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి చెందిన ఘటన <<16957129>>కట్టంగూరులో <<>>జరిగింది. శాలిగౌరారం(M)ఊట్కూరుకు చెందిన పిట్టల శంకరమ్మ, ఆమెకుమారుడు రజనీకాంత్ HYDలో నివాసం ఉంటున్నారు. నకిరేకల్(M) ఓగోడులో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్‌పై HYD బయలుదేరారు. KTNG బిల్లంకానిగూడెం సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన శంకరమ్మ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.
News July 6, 2025
JGTL: పది నెలల ఉచిత శిక్షణ.. 2 రోజులే గడువు

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో UPSC ప్రిలిమ్స్ పరీక్ష కోసం 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను ఇస్తున్నట్లు జగిత్యాల SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9959264770 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.