News January 4, 2026

సంగారెడ్డి: పది నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. హాల్ టికెట్లు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు సెయింట్ ఆంతోని (శాంతినగర్), సెయింట్ ఆంథోని (విద్యానగర్), సెయింట్ ఆర్నాల్డ్, కరుణ పాఠశాలలో పరీక్ష జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News January 6, 2026

కేటీదొడ్డి: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

భూభారతి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ ఆదేశించారు. మంగళవారం పాగుంట గ్రామ శివారులో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News January 6, 2026

ఎస్సీ కులాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట: SKLM కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు ఆర్థిక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. NSFDC, ఎన్ఎస్కెఎఫ్డీసీ పథకాల కింద రుణాలు పొంది, వడ్డీ చెల్లించలేని వారి కోసం వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 273 మంది లబ్ధిదారులకు రూ.180.70 లక్షలు వడ్డీ ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు.

News January 6, 2026

విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు దిశగా ఇన్ఫోసిస్

image

విశాఖపట్నంలో తన శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం ఇన్ఫోసిస్ ప్రయత్నాలు ప్రారంభించింది. మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో హైవే వెంబడి ఉన్న ఎండాడ కొండ ప్రాంతం, అలాగే పరదేశిపాలెం వద్ద క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సాగుతున్నాయి. కంపెనీ 20 ఎకరాల భూమిని కోరగా, అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ రుషికొండ ఐటీ సెజ్‌లోని అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.