News October 6, 2025

సంగారెడ్డి: పది ప్రత్యేక తరగతుల్లో మార్పులు

image

పదో తరగతి ప్రత్యేక తరగతులు సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సాయంత్రం మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 7, 2025

శుభ సమయం (07-10-2025) మంగళవారం

image

✒ తిథి: పూర్ణిమ ఉ.9.35 వరకు
✒ నక్షత్రం: రేవతి తె.3.46 వరకు
✒ శుభ సమయం: ఉ.6.30-ఉ.8.30
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: సా.4.42-సా.6.12
✒ అమృత ఘడియలు: రా.1.51-తె.3.23

News October 7, 2025

శిక్షణకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు: కలెక్టర్ హనుమంతరావు

image

స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం తుర్కపల్లి రైతు వేదికలో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు (పీఓలకు) నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News October 7, 2025

బెస్ట్ అవైలబుల్ స్కూల్‌ విద్యార్థుల ఇబ్బంది.. కొప్పుల ఆగ్రహం

image

జగిత్యాల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బయటకు పంపివేయడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ శాఖ మంత్రి లక్ష్మణ్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. విద్యార్థులను వెంటనే స్కూల్స్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.