News August 26, 2025
సంగారెడ్డి: ‘పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి’

సంగారెడ్డి జిల్లాలో 190 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు వెంటనే వారికి కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాలని సూచించారు. పొద్దున్నతి పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
Similar News
News August 26, 2025
C.R.S.పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి: కమిషనర్

జీవీఎంసీ పరిధిలోని అన్ని ఆసుపత్రులు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (C.R.S.) పోర్టల్ లో జనన, మరణ వివరాలను నమోదు చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. దీనికోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం నుండి యూజర్ ఐడీలను తీసుకోవాలన్నారు. దీనివల్ల జనన, మరణ ధ్రువపత్రాలు జారీ సులభం అవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో జనన ధ్రువపత్రాలు తీసుకోవాలన్నారు.
News August 26, 2025
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా కృషి చేయాలి: కలెక్టర్

విద్యార్థులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రత్యేక అధికారులు, పోలీసులు హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నిర్భయంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు.
News August 26, 2025
మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం

TG: మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపింది. 50 మంది స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వారి నుంచి 1.15 కేజీల గంజాయి, 47gms ఓజీ వీడ్ స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.