News February 21, 2025

సంగారెడ్డి: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

image

జిల్లాలో మార్చి 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో కార్యాలయంలో ఎంఈవోలకు ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్తు, ఫర్నిచర్, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

వరంగల్: తపాలా శాఖ ఫిర్యాదుల స్వీకరణ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజల నుంచి తపాలా శాఖకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. 52వ డాక్ అదాలత్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోస్టల్ కవర్లో కె. శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్(స్టాఫ్ & విజిలెన్స్) పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ 500001కు డిసెంబర్ 1లోపు పంపించాలన్నారు.

News November 24, 2025

మధిర: లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

image

లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె.చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట వచ్చే రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులో వల పన్ని, లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

News November 24, 2025

మంగళగిరి చేనేతలకు గుడ్‌న్యూస్.. 12% మజూరీకి అంగీకారం

image

మంగళగిరి చేనేత కార్మికులు 2025-27 కాలానికి 12% మజూరీ రేటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు మంగళగిరి చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. సోమవారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మజూరి పెంపుదలపై సమావేశం నిర్వహించారు. ఆమోదించిన మజూరి ప్రకారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నామని బాలకృష్ణ చెప్పారు.